ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం.. కేసు నమోదు

NLR: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై నగరంలోని చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. కోటమిట్టకు చెందిన సిరాజ్ ఆన్‌లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నితిన్, గోయల్ అనే ఇద్దరు వ్యక్తులు నమ్మబలికి సిరాజ్ వద్ద నుంచి కొంత డబ్బులు తీసుకున్నారు. మోసపోయినట్లు గ్రహించిన సిరాజ్ సైబర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు.