నేడు మంత్రి పర్యటన వాయిదా
KMM: నేడు సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, కూసుమంచి మండలాల్లో జరగాల్సిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ మార్పును గమనించాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తదుపరి పర్యటన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.