జలాశయంలో చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే
PLD: ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో మాచర్ల మండలం అనుపు సమీపంలోని సాగర్ జలాశయంలో శనివారం చేప పిల్లల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గురజాల ఆర్డీవో మురళి , మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్‌తో కలిసి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. కృష్ణా జలాల్లో స్వయంగా చేప పిల్లలను ఎమ్మెల్యే విడుదల చేశారు.