దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ మృతి

దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ మృతి

ASR: బొబ్బంపాడులో ఇటీవల జరిగిన భూతగాదాల వల్ల దాడికి గురై తీవ్రంగా గాయపడిన నీలమ్మ అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ వివాదంలో పాంగి రాంప్రసాద్ చేసిన దాడిలో ముందుగా నీలమ్మ భర్త సత్తిబాబు మృతి చెందాడు. గాయపడిన నీలమ్మను పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై షణ్ముఖరావు మంగళవారం తెలిపారు.