ఎన్‌కౌంటర్.. మావోయిస్టు కీలక నేత హతం
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్ జరిగింది. బైరంగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు రాజేష్ పూనెం మృతి చెందాడు. అయితే అతడిపై ప్రభుత్వం గతంలోనే రూ.5 లక్షల రివార్డును ప్రకటించింది. ఇతను చాలా కాలంగా ఆ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.