ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత
JGL: మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామనికి చెందిన అతి పురాతనమైన శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అదే గ్రామానికి చెందిన కొమ్ము సాయినాథ్ బుధవారం రూ. 25,000 విరాళం అందజేశారు. ఆలయంలో మూల స్వామి చుట్టూ ప్రదక్షిణ మార్గం నిర్మాణానికి ఈ విరాళం ఇచ్చానన్నారు. కమిటీ సభ్యులు సాయినాథ్ను సన్మానించారు.