కూసుమంచి ఎంఈవోగా రామాచారి బాధ్యతలు స్వీకరణ

KMM: కూసుమంచి ఎంఈవోగా రామాచారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ కూసుమంచి పాఠశాల HMగా పనిచేస్తున్న రాయల వీరస్వామి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా నేలపట్ల HMగా పని చేస్తున్న రామాచారిని ఎంఈవోగా నియమించడంతో ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యాయుల సహకారంతో మండల విద్యా శాఖను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.