ర్యాలి జగన్మోహిని ఆలయాన్ని దర్శించిన దేవాదాయ కమిషనర్
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారిని ఆదివారం సాయంత్రం దేవాదాయ శాఖ కమిషనర్ వి సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న వార్షిక కళ్యాణోత్సవాలను తిలకించారు