గుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తి స్పాట్ డెడ్

గుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తి స్పాట్ డెడ్

NLG: కేతపల్లి మండలం కొర్లపాడు గ్రామ పరిధిలోని ఎన్‌హెచ్–65పై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ వైపు వెళ్తున్న వాహనం ఢీ కొనడంతో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.