చలివేంద్రం ప్రారంభం

చలివేంద్రం ప్రారంభం

KMR: తిమ్మాపూర్ మండలం ఇంద్రనగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ ఆవుదుర్తి రాంకిషన్ వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రామస్తులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.