100 ఎకరాల్లో 'దివ్య వృక్షాల' ప్రాజెక్టు
AP: ఆధ్యాత్మికత, పర్యావరణ పెంపు లక్ష్యంతో 100 ఎకరాల్లో 'దివ్య వృక్షాల' ప్రాజెక్టు చేపట్టనున్నట్లు టీటీడీ ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. 'హిందూ ఆలయాల్లో ధ్వజ స్తంభాలకు అవసరమైన టేకు, ఏగిశ, కినో, టెర్మినేలియా, షోరియా జాతి వృక్షాలు ఇందులో ఉంటాయి. TTD ఆధ్వర్యంలో ప్రస్తుతం 60 ఆలయాలున్నాయి. భవిష్యత్‌లో వివిధ రాష్ట్రాల్లో మరిన్ని ఆలయాలు నిర్మించనున్నాం' అని తెలిపారు.