రేపు ఉచిత రక్తదాన శిబిరం

NGKL: జిల్లాలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యువత రక్తదానం చేసి, మరొకరికి ఆపద సమయంలో రక్తసాయం చేయాలని కోరారు.