మూడో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
KMR: మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బాన్సువాడలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఎన్నికల సామగ్రిని ఎలాంటి లోటుపాట్లు గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పక్కాగా అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.