శాప్ ఆఫీస్‌లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

AP: విజయవాడ శాప్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వం చేపట్టిన 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమంపై విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమం చెల్లింపులకు సంబంధించి హార్డ్‌డిస్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు అధికారులను విజిలెన్స్ అధికారులు విచారించారు.