గోనెగండ్లలో మహిళలకు బస్సు సమస్యలు

గోనెగండ్లలో మహిళలకు బస్సు సమస్యలు

KRNL: గోనెగండ్లలో మహిళల బస్సు ప్రయాణం కష్టంగా మారింది. ఉచిత ప్రయాణ పథకం ఉన్నా బస్సులు ఆగకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంటల తరబడి ఎదురుచూసినా ప్రయోజనం లేకపోతోందని మహిళలు వాపోతున్నారు. బస్సులు ఇప్పటికే నిండుగా వస్తున్నాయని, తమ గ్రామంలో ఆపడం లేదని ఇవాళ జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని మహిళలు కోరారు.