నానో యూరియా, డీఏపీ వినియోగంపై రైతులకు అవగాహన

NLG: చండూరు మండలం బంగారిగడ్డకు చెందిన సుంకరి యాదగిరి పత్తి చేనులో మంగళవారం నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై వ్యవసాయ అధికారి చంద్రిక రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు నానో యూరియా, నానో డీఏపీ పంట దిగుబడి పెంచడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయన్నారు.