IELTSలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

IELTSలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఆసిఫాబాద్ జిల్లాలో డిగ్రీ పాసైన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు IELTSలో ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రమాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఈనెల 21లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి ఆదిలాబాద్ BC స్టడీ సర్కిల్‌లో శిక్షణ అందిస్తామన్నారు.