VIDEO: జిల్లా కేంద్రంలో యూరియా లేక రైతుల అవస్థలు

MBNR: జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం వద్ద యూరియా స్టాక్ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి రైతులు కార్యాలయం వద్ద పడికాపులు రాస్తున్నారు. రైతుల కంటే కూడా స్టాక్ తక్కువగా ఉండడంతో అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ చేతుల్లో కూడా ఏమీ లేదని చేతులు ఎత్తేసిన పరిస్థితి నెలకొంది.