తర్తూరు రంగనాథ స్వామి జాతర సిద్ధం
NDL: మరో మూడు రోజుల్లో తర్తూరు శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి జాతర ప్రారంభం కానుంది. రాయలసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. వృషభ బండలాగుడు పోటీలు, బొమ్మల అంగళ్లు, రైతు పరికరాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఏప్రిల్ 2న రథోత్సవం నిర్వహించనుండగా ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.