VIDEO: రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
అన్నమయ్య: మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్‌పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప సబ్ జైలు వీధికి చెందిన దీవన (24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యోగం కోసం స్నేహితుడు ఉమామహేష్‌తో కలిసి బెంగళూరుకు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపుతప్పి పడ్డాడు. గాయపడిన ఉమామహేష్‌ను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.