'ఏప్రిల్ నాటికి మున్సిపల్ భవనం పూర్తి చేయాలి'

'ఏప్రిల్ నాటికి మున్సిపల్ భవనం పూర్తి చేయాలి'

KRNL: మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. గురువారం మంత్రి నూతన కార్యాలయ నిర్మాణ పనులను కమిషనర్ పి. విశ్వనాథ్‌తో కలిసి పరిశీలించారు. పరిపాలనా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు రూ. 28 కోట్లతో ఈ భవనాన్ని చేపడుతున్నామని, సుమారు 50% పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.