శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయం

శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయం

విజయనగరం: మహాశివరాత్రి సందర్భంగా కొత్తవలస విశాఖ ప్రధాన రహదారి మంగళపాలెం శివాలయంలో ఉదయం నుండి భక్తులతో కిటకిటాడింది. వేకువజామున నుండి భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. శివరాత్రి నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, గోత్ర నామస్మరణంతో ఆలయ ప్రాంగణం మార్మోగాయి. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు రుద్రాభిషేకాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకుడు తెలిపారు.