'మే 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి'
NRML: జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ పురుషుల డిగ్రీ కళాశాలలో BSc, B.Com, BBA, BA కోర్సుల ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. విజయ్ కుమార్ తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు మే 10లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి 3 సంవత్సరాల హాస్టల్ వసతి, పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారని తెలిపారు.