నాగంబొట్లపాలెంలో పోలేరమ్మ కొలుపులు ప్రారంభం

నాగంబొట్లపాలెంలో పోలేరమ్మ కొలుపులు ప్రారంభం

ప్రకాశం: తాళ్లూరు, మండలంలోని నాగంబొట్లపాలెం గ్రామ పోలేరమ్మ కొలుపులు ఆదివారం ప్రారంభించారు. పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పొంగళ్లు, నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో పోలేరమ్మ కొలుపులు తొమ్మిది రోజులు నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు వెల్లడించారు. కాగా, అధిక సంఖ్యలో మహిళలు, గ్రామస్థులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.