మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: చంద్రశేఖర్ పురం మండలం శీలంవారిపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పధకంను పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.