వైసీపీపై మంత్రి ఆనం తీవ్ర విమర్శలు

కృష్ణా: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందూ ధర్మాన్ని విమర్శించడమే వైసీపీ పనిగా పెట్టుకుందని, హిందువులపై రాజకీయ క్రీడ నడపాలనుకోవడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఆలయాలు, పాలక మండళ్లు, దేవదాయశాఖపై విషం చిమ్ముతున్నారని, అసత్యాలతో వైసీపీ చేస్తున్న వికృత క్రీడను దేవుడు కూడా క్షమించడని ఆయన పేర్కొన్నారు.