రిటైర్డ్ పోలీసుల నూతన కార్యవర్గం ఎన్నిక

NZB: తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఎం.నాగేందర్, ప్రధాన కార్యదర్శిగా లింగన్న, కోశాధికారిగా టి.నారాయణతో పాటు గౌరవ అధ్యక్షులుగా 4, ఉపాధ్యక్షులుగా 3, సంయుక్త కార్యదర్శులుగా 4, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా 4, ఈసీ సభ్యులుగా 8, సలహదారులుగా 12 మందిని నియమించారు.