'వైసీపీ శ్రేణుల భార్యలపై మాట్లాడిన మాటలను సమర్థిస్తారా?'
AP: ఓ ఛానల్లో వైసీపీ శ్రేణుల భార్యల పట్ల దుర్మార్గంగా మాట్లాడారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ఆ మాటలు తప్పని చెప్పకుండా.. చంద్రబాబు, లోకేష్, పవన్ సమర్థిస్తారా? అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళల పట్ల అశ్లీలంగా ప్రవర్తించిన అరవ శ్రీధర్, కూన రవి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే, మంత్రి సంధ్యారాణి పీఏ మీద ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు.