'రెగ్యులర్ అధికారులను నియమించాలి'

'రెగ్యులర్ అధికారులను నియమించాలి'

MNCL: జన్నారం మండలంలోని వివిధ శాఖలకు రెగ్యులర్ అధికారులను నియమించాలని బీజేపీ జిల్లా నాయకులు గోలి చందు కోరారు. ఆదివారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీడీవో, తాహాసీల్దార్, ఏవో, ఎంఈవో, ఎస్సై పోస్టులకు రెగ్యులర్ అధికారులు లేరని, ప్రస్తుతం ఇంఛార్జ్‌లే అధికారులే ఉన్నారన్నారు. దీంతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ఆయా పోస్టులకు రెగ్యులర్ అధికారులను నియమించాలన్నారు.