విషం పెట్టి కోళ్లను చంపిన ఘటనపై ఫిర్యాదు

విషం పెట్టి కోళ్లను చంపిన ఘటనపై ఫిర్యాదు

అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలంలోని పాపేపల్లిలో ఇవాళ కోళ్లను విషం పెట్టి చంపిన ఘటన వెలుగు చూసింది. మిర్యాల సుబ్బయ్య కుమారుడు మహేందర్ ఫ్లోరైడ్ పెట్టడంతో సుమారు 20 నుంచి 30 పెంపుడు కోళ్లు చనిపోయాయని గ్రామస్తులు ఆరోపించారు. బాధితులు పెద్దమండెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై శ్రావణి స్పందించి కేసును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.