ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: అభిలాష అభినవ్

NRML: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల వద్ద నుండి దరఖాస్తులను వారు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.