విద్యుత్ సరఫరాలో అంతరాయం
PLD: దాచేపల్లిలోని నడికుడి ఫేస్ 1 ఇండస్ట్రియల్ ఏరియాలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ భగవాన్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ ఉండదని చెప్పారు. నడికుడి ఫేస్ 1 ఇండస్ట్రియల్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.