అస్తవ్యస్తంగా మారిన బస్టాండ్ నిర్వహణ
MNCL: జన్నారంలోని ఆర్టీసీ బస్టాండ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండు నిర్వహణను చూస్తూ ప్రజలకు బస్సుల సమయ వేళలు తెలిపేందుకు గతంలో కంట్రోలర్ ఉండేవారు. ఆయనను మూడు నెలల క్రితం తీసివేయడంతో బస్టాండ్ నిర్వహణ అగమ్య గోచరంగా మారింది. వీధి కుక్కలు బస్టాండ్ లోని బెంచీలపై పడుకోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.