సీతారామపురంలో పూర్వ విద్యార్థుల ప్రోత్సాహం

PLD: నూజెండ్ల మండలం సీతారామపురం ఎస్‌వీఎస్‌సీ హైస్కూల్లో 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థులు ఉదారత చాటారు. 1991-96 బ్యాచ్ విద్యార్థులు పదో తరగతిలో మొదటి మూడు స్థానాలు సాధించిన వారికి వరుసగా రూ. 10,000, రూ. 5,000, రూ. 3,000 నగదు బహుమతులు అందజేశారు. ఈ మేరకు వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కామేశ్వరరావు శర్మ అభినందించారు.