ఓ యువతా మేలుకో ప్రదర్శన డ్రగ్స్‌పై అవగాహన

ఓ యువతా మేలుకో ప్రదర్శన డ్రగ్స్‌పై అవగాహన

KDP: చింతకొమ్మదిన్నె మండలంలోని కెఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం పోలీస్ కళా-జాగృతి బృందం 'ఓ యువతా మేలుకో' నాటకం ద్వారా యువతకు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో కీలక పాత్రపై అవగాహన కల్పించింది. సీఐ బాలమద్దిలేటి మాట్లాడుతూ.. మత్తుకు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని సూచించారు. డ్రగ్స్ సమాచారం ఉంటే 1972కి తెలియజేయాలని కోరారు.