వివేకానంద విగ్రహం శుద్ధి చేసిన బీజేపీ వోబీసీ నాయకులు
KNR: ఆగస్టు 15 సందర్భంగా బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు కరీంనగర్ డివిజన్లోని ప్రముఖుల విగ్రహాల శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జ్యోతి నగర్‌లోని స్వామి వివేకానంద విగ్రహాన్ని శుభ్రపరిచి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్నం ప్రకాష్, రాపర్తి ప్రసాద్, మామిడి రమేష్, పాక పవన్ కృష్ణ, వంగల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.