లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: డీఎస్పీ
SRPT: ఈ నెల 21న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ కోరారు. ఇరువర్గాల సమ్మతితో రాజీపడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్, మోటారు వాహన చట్ట ఉల్లంఘన కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని ఈరోజు తెలిపారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోవద్దని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.