నేడు జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీలు

KRNL: కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ ఔట్ డోర్ స్టేడియంలో ఇవాళ ఉదయం 10గంటలకు జిల్లాస్థాయి సబ్ జూనియర్స్, సీనియర్స్ సెపక్ తక్రా పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో 14ఏళ్లలోపు ఉండాలన్నారు. ప్రతిభావంతులు 13, 14న అనంతపురం రాష్ట్ర సబ్ జూనియర్ పోటీలు, 27, 28న ఒంగోలు సీనియర్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.