నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NLR: కావలి సబ్ డివిజన్ పరిధిలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. రెండో శనివారం కావడంతో సబ్ స్టేషన్లలో మరమ్మతుల వల్ల ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు Dy.EE రవికుమార్ తెలిపారు. గృహ, వాణిజ్య, వ్యవసాయ వినియోగదారులు గమనించాలని పేర్కొన్నారు.