టీకాంగ్రెస్ కీలక నిర్ణయం

TG: టీకాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కాంగ్రెస్‌ను వీడిన నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని టీ.పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. భట్టి ప్రతిపాదనకు టీపీసీసీ కార్యవర్గం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో తిరిగి హస్తం పార్టీ గూటికి రావాలనుకుంటున్న ముఖ్య నేతలకు తలుపులు తెరుచుకున్నాయి.