టైలర్స్ సమస్యలపై మంత్రికి వినతి
W.G: టైలర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి సవితను రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి కోరారు. ఈ మేరకు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఆకాశపు స్వామి సోమవారం తాడేపల్లిగూడెంలో తెలిపారు. బ్రాండెడ్ షాపుల ప్రభావంతో టైలరింగ్ వృత్తి కొరవడిందని, టైలర్లకు వృత్తి భద్రత కల్పించాలని కోరారు. ఆయన వెంట టైలర్ సంఘ ప్రతినిధులు ఉన్నారు.