VIDEO: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

VIDEO: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

W.G: తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున లారీ అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. రావులపాలెం నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న ఈ వాహనం వంతెన రైలింగ్‌ను బలంగా ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైవే, తణుకు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.