గీసుగొండలో దొంగలు అరెస్ట్
WGL: గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చాపూర్, గొర్రెకుంట గ్రామాలలో కట్టమల్లన్న గుడి, కిరాణా షాపులు, పాన్ షాపులలో జరుగుతున్న దొంగతనాలను సీసీటీవీ పుటేజ్ ద్వారా గుర్తించారు. ఈరోజు అనుమానాస్పదంగా తిరుగుతున్న కాశీబుగ్గకు చెందిన పల్లకొండ ఉపేందర్, కటకం ప్రణయ్, శివనగర్‌కు చెందిన పులుచెరు చంద్రశేఖర్‌లను గుర్తించి అరెస్ట్ చేసినట్లు CI మహేందర్ తెలిపారు.