శ్రీవారిని దర్శించుకున్న మంత్రి

TPT: మంత్రి కందుల దుర్గేశ్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్‌లో ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచేందుకు సీఎం చేస్తున్న పర్యటన విజయవంతం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు.