ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు అక్కడికక్కడే మృతి

JN: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన బచ్చన్నపేటలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బచ్చన్నపేట నుండి పోచన్నపేటకు వెళ్తున్న ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో పేర్ని గౌతమ్ (20) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.