ఏసీబీ వలలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

SRCL: ఏసీబీ వలకు అవినీతి అధికారి చిక్కాడు. ఏకంగా రూ. 60,000/- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక అధికారులకు పట్టుబడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) గా విధులు నిర్వహిస్తున్న అమరేందర్ రెడ్డి జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరు చెక్ డాం బిల్లుల కోసం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.