రేపు 5K, 10K, 21K రన్.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!

రేపు 5K, 10K, 21K రన్.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!

HYD: రేపు ఉదయం 5 నుంచి 9 గంటల వరకు జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియం, HYD విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. “రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్” 10వ ఎడిషన్ సందర్భంగా 5K, 10K, 21K విభాగాల్లో సుమారు 8,500 మంది పాల్గొననున్నారు. దీనిని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని ట్రాఫిక్ సూచనలు పాటించాలని పోలీసులు తెలిపారు.