మండల ముస్లిం మైనార్టీ ఖాజీగా మౌలానా షేక్

NDL: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల ముస్లిం మైనార్టీ ఖాజీగా పట్టణానికి చెందిన ఆలీమ్ మౌలానా షేక్ ముర్తుజా వలి నియమితులయ్యారు. ఈమేరకు ఆయన ముస్లిం మైనార్టీ పెద్దలతో కలిసి వేల్పనూరులో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిని గౌరవ ప్రదంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డాను సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ముస్లింల అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు.