బంగారం దుకాణంలో చోరీ

బంగారం దుకాణంలో చోరీ

SKLM: సరుబుజ్జిలి మండల కేంద్రంలో శ్రీలక్ష్మి జ్యువెలర్స్ షాప్‌లో దొంగతనం జరిగింది. ఈ  ఘటనకు సంబంధించి యజమాని బొడ్డేపల్లి హరిబాబు చెప్పిన వివరాలు ప్రకారం.. ఆదివారం రాత్రి తమ వ్యాపారం ముగించుకొని ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. సోమవారం ఉదయం యధావిధిగా షాపుకు వచ్చి తెరిచి చూసే వరకు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆముదాలవలస సీఐ దివాకర్ యాదవ్ వచ్చి షాపును పరిశీలించారు.