'అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
VSP: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. ఆదివారం గోపాలపట్నంలో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. వేతనాల పెంపుపై సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని, త్వరలో శుభవార్త ఉంటుందన్నారు. గ్రాట్యుటీకి రూ.20 కోట్లు, మౌలిక వసతులకు రూ.86 కోట్లు కేటాయించామని చెప్పారు.